పాకిస్థాన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత సైన్యం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి

పాక్ భాషలోనే.. దిమ్మతిరిగే బదులిచ్చిన భారత సైన్యం!

పదే పదే భారత్‌పై దాడులకు తెగబడుతూ.. సైనికులు, సామాన్యుల ప్రాణాలు హరిస్తోన్న పాక్‌కు భారత సైన్యం తగిన రీతిలో బుద్ధి చెప్పింది. ఉగ్రవాదులను ఎగవేస్తే.. సైనికులను బలిగొంటున్న శత్రు దేశానికి దాని భాషలోనే బదులిచ్చింది. కశ్మీర్లోని ఉరి సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ చెక్ పోస్టును ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. వరుసగా రెండు రోజుల్లో రెండు పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వీడియోలను టైమ్స్ నౌ సంపాదించింది.

సుంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై దాడి, శ్రీనగర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడికి యత్నించడం, ఆసుపత్రి నుంచి ఉగ్రవాదిని విడిపించేందుకు కాల్పులు జరపడం లాంటి దుందుడుకు చర్యలకు పాక్ ఇటీవల పాల్పడింది. ఇవన్నీ చేయడమే కాకుండా.. ఉరి దాడి ఘటన తర్వాత సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగినట్లు మళ్లీ దాడి చేస్తే సహించబోమని మనల్ని హెచ్చరించింది.

సుంజవాన్ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. అతి త్వరలోనే పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. సర్జికల్ స్ట్రైక్స్‌తోపాటు పాక్‌కు బుద్ధి చెప్పేందుకు అనేక మార్గాలు ఉన్నాయన్నారు. అందుకు అనుగుణంగానే.. భారత సైన్యం పాకిస్థాన్‌పై ప్రతీకార దాడులు మొదలు పెట్టింది.