25 రోజుల బిడ్డను చంపిన తల్లి కారణం వింటే చెప్పుతో కొడతారు

25 రోజుల బిడ్డను చంపిన తల్లి.. కారణం వింటే షాక్

ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు. కన్నబిడ్డకు చిన్న కష్టమొస్తేనే తట్టుకోలేదు అమ్మ. చిన్న దెబ్బ తగిలినా… తల్లిడిల్లిపోతుంది. కాని ఓ కసాయి తల్లి మానవత్వాన్ని మరిచింది. పసిబిడ్డని కూడా చూడకుండా చంపేసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దక్షిణ ఢిల్లీలోని వినోద్‌నగర్‌కు చెందిన మహిళ 25 రోజుల క్రితం ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే చిన్నారి రోజూ పదే, పదే ఏడుస్తోంది. ఎంత సముదాయించినా… ఏడుపు ఆపడం లేదు. పాప ఏడుపుతో తల్లికి చిర్రెత్తుకొచ్చింది. కోపంతో ఊగిపోయింది. కన్నబిడ్డనే విషయాన్ని మర్చిపోయి కర్కశంగా ప్రవర్తించింది.

ఆగ్రహంతో బిడ్డను తీసుకెళ్లి చెత్త బుట్టలో విసిరికొట్టింది. ఆ పసిబిడ్డకు ఊపిరాడక ప్రాణాలు విడిచింది. తర్వాత ఏం చేయాలో అర్థంకాక… బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారని కొత్త డ్రామా ఆడింది. కేసు నమోదు చేసిన పోలీసులు… ఎంత గాలించినా బిడ్డ ఆచూకీ దొరకలేదు. చివరికి అనుమానంతో తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా… తానే చంపేశానని ఒప్పుకుంది. పదే, పదే పాప ఏడుస్తుండటంతోనే చంపేసినట్లు తాపీగా చెప్పిందట. ఈ మాటలు విన్న పోలీసులు షాకయ్యారు.